జగన్ తుళ్లూరులో కనిపిస్తే మహిళలు ఏం చేస్తారో చెప్పిన సీపీఐ నేత రామకృష్ణ!

06-02-2020 Thu 09:13
  • జగన్ తుళ్లూరులో కనిపిస్తే మహిళలు ముక్కలుగా నరికేస్తారు
  • ఒక గాడిద అమరావతిని శ్మశాసనమంటాడు
  • అమరావతి ప్రజలు శాంతికాముకులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడికొండలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఒక గాడిద అమరావతిని శ్మశాసనమంటాడని, వాడొక మంత్రి అని, అతడి పేరు బొత్స అని పరుష వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంత రైతులకు భయపడి గుండుకొట్టించుకుని తిరుగుతున్నాడని అన్నారు.

నిజానికి ఈ ప్రాంత ప్రజలు శాంతికాముకులని, 50 రోజులైనా శాంతియుతంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. అదే తమ రాయలసీమలో అయితే ఇప్పటికే ఎక్కడికక్కడ పగలగొట్టేవాళ్లమన్నారు. 151 సీట్లతో గెలిచిన జగన్ సుపరిపాలన అందించాల్సింది పోయి  ప్రజావ్యతిరేక పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తుళ్లూరులో కనిపిస్తే ఇక్కడి మహిళలు ముక్కలు ముక్కలుగా నరికేస్తారని, అందుకే ఆయన పోలీసులను అడ్డంపెట్టుకుని తిరుగుతున్నారని అన్నారు.