'ఉప్పెన' ఫస్టు వేవ్ ప్రోమో రిలీజ్

  • బుచ్చిబాబు తొలి సినిమాగా 'ఉప్పెన'
  • కథానాయికగా కృతి శెట్టి పరిచయం 
  •  ఏప్రిల్ 2వ తేదీన విడుదల  

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా .. బుచ్చిబాబు దర్శకుడిగా 'ఉప్పెన' సినిమా రూపొందింది. మైత్రీమూవీ మేకర్స్ వారితో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాతో కథానాయికగా కృతి శెట్టి తెలుగు తెరకి పరిచయం కానుంది. ఫస్టు వేవ్ పేరుతో ఈ సినిమా నుంచి ఒక ప్రోమోను విడుదల చేశారు.

హీరో .. హీరోయిన్లను పూర్తిగా చూపించకుండా, ఆ ఇద్దరికి సంబంధించిన విజువల్స్ పై కట్ చేసిన ఈ ప్రోమో ఆకట్టుకునేలా వుంది. కాకినాడ సముద్ర తీరంలోని ఓ జాలరి కుర్రాడి ప్రేమకథగా ఈ సినిమా రూపొందినట్టు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ఆయన సిగ్నేచర్ మ్యూజిక్ ఈ ప్రోమోలోను ఆకట్టుకుంటోంది. ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మొదటి సినిమాతో వైష్ణవ్ తేజ్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో, కృతి శెట్టి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

More Telugu News