Mahesh Babu: వంశీ పైడిపల్లి సినిమా కోసం వచ్చేసిన మహేశ్

  • సక్సెస్ ను ఎంజాయ్ చేసిన మహేశ్ 
  • అమెరికా నుంచి హైదరాబాద్ కి 
  • త్వరలోనే వంశీ పైడిపల్లితో సెట్స్ పైకి
మహేశ్ బాబు నుంచి ఇటీవల వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సక్సెస్ ను ఫ్యామిలీతో కలిసి మహేశ్ బాబు ఎంజాయ్ చేశాడు. ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లిన మహేశ్ బాబు, మోకాలుకి శస్త్రచికిత్స చేయించుకుంటారనే టాక్ వచ్చింది. 5 నెలల విశ్రాంతి అనంతరమే ఆయన షూటింగులో పాల్గొంటారనే ప్రచారం జరిగింది.

అయితే ఫ్యామిలీతో కలిసి మహేశ్ బాబు హైదరాబాద్ వచ్చేశాడు. ఆయన మోకాలు శస్త్ర చికిత్సకి సంబంధించిన ప్లానింగులో మార్పు ఏదైనా జరిగిందా అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. మహేశ్ బాబు హైదరాబాద్ కి వచ్చేయడంతో, రేపో మాపో వంశీ పైడిపల్లి సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుందని అంటున్నారు. వచ్చేది వేసవి కనుక .. ఎండలను దృష్టిలో పెట్టుకునే షెడ్యూల్స్ ను ప్లాన్ చేయమని వంశీ పైడిపల్లితో మహేశ్ చెప్పినట్టుగా అనుకుంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.
Mahesh Babu
Vamsi Paidipalli
New Movie

More Telugu News