Barrowings: తెలంగాణ అప్పులపై బీజేపీ, కాంగ్రెస్ నేతలవి అసంబద్ధ ఆరోపణలు: మంత్రి కేటీఆర్

  • ఈ విషయంలో వారు అవగాహన పెంచుకోవాలి
  • జీఎస్డీపీలో అప్పులు 17శాతం మించలేదు
  • ఎఫ్ఆర్ బీఎం పరిమితులకు లోబడే ఉన్నాయి

తెలంగాణ రాష్ట్ర రుణాలపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆ పార్టీల నేతలు ఈ విషయంలో మరింత అవగాహన పెంచుకోవాల్సి ఉందంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం అప్పులకు సంబంధించి లోక్ సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధాన ప్రతిని కూడా కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాష్ట్ర అప్పులు స్థూల రాష్ట్ర ఉత్పత్తి(జీఎస్డీపీ) లో 17శాతంగా ఉన్నాయని కేంద్రం పేర్కొందని తెలిపారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితులు, ఆర్థిక భద్రత ప్రమాణాలమేరకు అప్పులు ఉన్నాయన్నారు.

More Telugu News