First Wave: 'ఫస్ట్ వేవ్' అంటూ ఆసక్తి రేకెత్తిస్తున్న 'ఉప్పెన' యూనిట్

  • ఉప్పెన చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న వైష్ణవ్ తేజ్
  • రేపు ఉదయం ఉప్పెన నుంచి ఫస్ట్ వేవ్ వస్తుందంటూ చిత్ర యూనిట్ వెల్లడి
  • ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్న ఫస్ట్ లుక్
  • ఏప్రిల్ 2న విడుదల కానున్న ఉప్పెన

మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఉప్పెన'. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా, ఈ సినిమా నుంచి రేపు 'ఫస్ట్ వేవ్' వస్తోందంటూ చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. "ఉప్పెన నుంచి మొదటి కెరటం (ఫస్ట్ వేవ్) రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు మీ హృదయాన్ని తాకుతుంది" అంటూ 'సుకుమార్ రైటింగ్స్' పోస్టు చేసింది. ఈ చిత్రం నుంచి రేపు బహుశా ఓ పాట రిలీజయ్యే అవకాశాలున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 2న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

More Telugu News