ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
- కార్యాలయాలను తరలించొద్దని చెప్పినా ఎందుకు తరలిస్తున్నారు?
- కార్యాలయాలు సరిగా లేకపోతే కొత్త నిర్మాణాలు చేపట్టవచ్చు కదా?
- మధ్యాహ్నం తర్వాత మరోసారి విచారణ చేపడతాం
ఈ సందర్భంగా ఏజీ స్పందిస్తూ అమరావతిలో కార్యాలయాల నిర్వహణ సరిగా లేదని, కార్యాలయాల తరలింపు అనేది ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, స్థానికంగా ఉన్న స్థలంలోనే కొత్త నిర్మాణాలను చేపట్టవచ్చు కదా? అని ప్రశ్నించారు. ఈ పిటిషన్ తో మరో రెండు పిటిషన్లను కలిపి మధ్యాహ్నం మరోసారి విచారణ చేపడతామని చెప్పారు. ఇరు వైపుల వాదనలను విన్న తర్వాత హైకోర్టు తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.