Pavankalyan: పవన్ తో సినిమా రీమేక్ కాదంటున్న హరీశ్ శంకర్

  • ఇటీవలే హిట్ కొట్టిన హరీశ్ శంకర్ 
  • పవన్ కల్యాణ్ తో సినిమా 
  • ఇది రీమేక్ అంటూ ప్రచారం
తెలుగులో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన యువ దర్శకులలో హరీశ్ శంకర్ ఒకరు. మాస్ ఆడియన్స్ కి నచ్చే అన్ని అంశాలు తన కథలో వుండేట్టుగా ఆయన జాగ్రత్తలు తీసుకుంటాడు. గతంలో పవన్ తో ఆయన చేసిన 'గబ్బర్ సింగ్' .. ఈ మధ్య వరుణ్ తేజ్ తో చేసిన 'గద్దలకొండ గణేశ్' రెండూ కూడా రీమేక్ లే.

అలాగే ఆయన త్వరలో పవన్ కల్యాణ్ తో చేయనున్న సినిమా కూడా రీమేక్ సబ్జెక్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై హరీశ్ శంకర్ స్పందించాడు. 'పవన్ కల్యాణ్ తో నేను చేయనున్న సినిమా రీమేక్ అంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇలాంటి కథనాలను మీడియావారు రాసేటప్పుడు .. ప్రసారం చేసేటప్పుడు నా నుంచి క్లారిటీ తీసుకుంటే బాగుండేది' అంటూ ఆయన స్పందించాడు.
Pavankalyan
Harish Shankar
Tollywood

More Telugu News