Rishi Kapoor: తన అనారోగ్యానికి కారణం ఏమిటో చెప్పిన రిషికపూర్

  • 18 రోజులుగా ఢిల్లీలో షూటింగ్ లో పాల్గొన్నా
  • వాతావరణ కాలుష్యంతో ఇన్ఫెక్షన్ కు గురయ్యా
  • ప్రస్తుతం ముంబైలో ఉన్నా
క్యాన్సర్ వ్యాధి కారణంగా అమెరికాలోని న్యూయార్క్ లో బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ చికిత్స పొందిన సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ లో ఆయన భారత్ కు తిరిగి వచ్చారు. అయితే, ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారనే వార్తతో అభిమానులు కలవరానికి గురయ్యారు. దీనికి సంబంధించి ట్విట్టర్ ద్వారా ఆయన క్లారిటీ ఇచ్చారు.

'నాపై మీరందరూ చూపించిన ప్రేమ మరువలేనిది. నా ఆరోగ్యం గురించి ఎవరూ కలత చెందవద్దు. ఢిల్లీలో గత 18 రోజులుగా షూటింగ్ లో పాల్గొంటున్నా. ఢిల్లీలోని వాతావరణంతో పాటు నా శరీరంలోని తెల్ల రక్తకణాల కౌంట్ తక్కువ స్థాయిలో ఉండటంతో ఇన్ఫెక్షన్ కు గురయ్యాను. స్వల్ప జ్వరంతో బాధపడుతున్నా. ఇది న్యుమోనియాకు దారి తీసే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పడంతో, చికిత్స తీసుకున్నాను. ప్రస్తుతం అంతా తగ్గిపోయింది. ఆరోగ్యంగా ఉన్నాను. అయితే, జనాలు మరో విధంగా అర్థం చేసుకున్నారు. అందుకే ఇలాంటి పుకార్లకు అడ్డుకట్ట వేయాలని వివరణ ఇస్తున్నా. మిమ్మల్ని సినిమాల ద్వారా మరింత ఎంటర్టైన్ చేసేందుకు నా వంతు కృషి చేస్తా. ప్రస్తుతం నేను ముంబైలో ఉన్నా' అని రిషి కపూర్ ట్వీట్ చేశారు.
Rishi Kapoor
Health
Bollywood

More Telugu News