Vijay Sai Reddy: 'ఎలాగూ జైలుకు పోయేదేకదా' అని పిచ్చి కూతలు కూస్తున్నారు: విజయసాయిరెడ్డి

  • రాజధానుల ప్రకటనతో టీడీపీ నాయకుల ఉక్రోషం కట్టలు తెంచుకుంటోంది.
  • సీఎం హోదాను సైతం అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు
  • ఇన్‌సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడుతుంది
  • మీ రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి 
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిలో భూములపై విచారణ జరిపేందుకు ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేస్తూ టీడీపీ నేతల రాజకీయాలకు తెరపడే రోజులొచ్చాయని అన్నారు.

'మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకుల ఉక్రోషం కట్టలు తెంచుకుంటోంది. సీఎం హోదాను సైతం అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారు. మీ రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి' అని ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News