Crime News: తండాల్లోని పిల్లలను కొని.. రూ.లక్షలకు విక్రయిస్తోన్న ముఠా అరెస్టు

  • ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఠా
  • పరారీలో ప్రధాన నిందితుడు
  • ఆరుగురు సభ్యుల ముఠాను ప్రశ్నిస్తోన్న పోలీసులు
వీధుల్లో తిరుగుతున్నారు.. సంతానం లేని దంపతుల కోసం వెతుకుతున్నారు. వారిని గుర్తించి వారితో బేరమాడి పిల్లల్ని విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండాల్లోని అధిక సంతానం ఉన్న పేదల నుంచి చిన్నారులను కొనుగోలు చేసి వారిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.

ఆరుగురు సభ్యుల ముఠాను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 
Crime News
Hyderabad
Hyderabad District

More Telugu News