Sujana Chowdary: రాజధానిని ఒక్క అంగుళం కూడా కదలించలేరు: బీజేపీ ఎంపీ సుజనా చౌదరి

  • సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది
  • రాజధాని విషయంలో న్యాయ, రాజ్యాంగపరంగా ముందుకెళ్తాం
  • కాలయాపన తప్ప జగన్ చేసేదేమీ లేదు
అమరావతి నుంచి రాజధానిని ఒక్క అంగుళం కూడా కదలించలేరన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని విషయమై సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని భావిస్తున్నానని అన్నారు. అమరావతి విషయంలో న్యాయ, రాజ్యాంగపరంగా ముందుకెళ్తామని, అభివృద్ధి పేరుతో కాలయాపన తప్ప జగన్ చేసేదేమీ లేదని విమర్శించారు.    
Sujana Chowdary
BJP
Amaravati
3 capitals

More Telugu News