Anand Mahindra: గూగుల్ వీడియోతో కంటతడి పెట్టుకున్న ఆనంద్ మహీంద్రా

  • సూపర్ బౌల్ 2020 పేరిట గూగుల్ యాడ్ వీడియో
  • స్పందించిన ఆనంద్ మహీంద్రా
  • మా హృదయాల్లోకి చొచ్చుకొని పోయారంటూ గూగుల్ కు అభినందన

ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సూపర్ బౌల్ 2020 పేరిట ఓ వాణిజ్య ప్రకటన విడుదల చేసింది. ఓ వ్యక్తి తన చనిపోయిన భార్య జ్ఞాపకాలను గూగుల్ అసిస్టెంట్ సాయంతో మళ్లీ గుర్తు చేసుకుంటాడు. ఆ వీడియోలో వచ్చే భార్యాభర్తల పాతకాలం నాటి ఫొటోలు తీవ్ర భావోద్వేగాలను కలిగించే విధంగా ఉంటాయి. అయితే ఈ వీడియో చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నానని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తెలిపారు.

ఈ సూపర్ బౌల్ యాడ్ తనను ఏడిపించిందని తెలిపారు. ఈ వీడియోతో తన పాత స్మృతులు కూడా జ్ఞప్తికి వచ్చాయని, కొన్నింటితో తనను తాను ఐడెంటిఫై చేసుకున్నానని వివరించారు. తనకే కాకుండా చాలామందిని ఈ వీడియో కదిలిస్తుందని, హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్లేలా రూపొందించారని గూగుల్ ను అభినందించారు.

  • Loading...

More Telugu News