TG Venkatesh: "మా తెలుగుదేశం నేతలు" అంటూ నాలిక్కరుచుకున్న టీజీ వెంకటేశ్

  • ఢిల్లీలో టీజీ మీడియా సమావేశం
  • సార్ మీది బీజేపీ అంటూ గుర్తుచేసిన మీడియా ప్రతినిధులు
  • తెలుగుదేశం కాదు తెలుగు ప్రజలు అంటూ వివరణ ఇచ్చిన టీజీ
రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ టీడీపీని వీడి బీజేపీలో చేరి కొన్ని నెలలు గడుస్తోంది. అయితే ఈ రాజ్యసభ సభ్యుడు ఇంకా తాను టీడీపీలో ఉన్నాననుకుంటున్నారేమో... తాజాగా మీడియా సమావేశంలో "మా తెలుగుదేశం నేతలు" అంటూ వ్యాఖ్యానించి నాలిక్కరుచుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో ఓ మీడియా సమావేశంలో జరిగింది. అయితే, టీజీ ఆ వ్యాఖ్యలు చేయగానే చురుగ్గా స్పందించిన మీడియా ప్రతినిధులు "సార్ మీరిప్పుడు బీజేపీలో ఉన్నారు" అంటూ గుర్తు చేయడంతో ఆయన కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. "సారీ, తెలుగుదేశం కాదు, తెలుగు ప్రజలు" అంటూ మళ్లీ మొదట్నించి మాట్లాడారు.
TG Venkatesh
Telugudesam
New Delhi
BJP

More Telugu News