Vijayasai Reddy: ‘రాజశ్యామల యాగం పూర్ణాహుతి’లో జగన్, విజయసాయిరెడ్డి.. ఫొటోలు ఇవిగో!

  • వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ఆసక్తికర పోస్ట్ 
  • విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు
  • ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసిన విజయసాయి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. సీఎం జగన్ తో కలిసి ఇవాళ విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి, వివిధ పూజా కార్యక్రమాల్లో సీఎం జగన్ తో కలిసి తాను పాల్గొన్నానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను విజయసాయిరెడ్డి జతపరిచారు. కాగా, ఈ ఫొటోల్లో విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.
Vijayasai Reddy
YSRCP
Jagan
Rajashyamala Yagam

More Telugu News