Sachin Tendulkar: ఆడపులి, దాని పిల్లలు ఆడుకుంటుంటే చూడ్డానికి ఎంత బాగుందో!: సచిన్

  • తడోబా అంధారి టైగర్ రిజర్వ్ లో సచిన్ పర్యటన
  • ప్రత్యేక వాహనంలో విహారం
  • ట్విట్టర్ లో వీడియో పోస్టు చేసిన క్రికెట్ గాడ్

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తడోబా అంధారి టైగర్ రిజర్వ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పెద్దపులులను చూసి సచిన్ అచ్చెరువొందారు. తన విహారంపై ట్వీట్ చేశారు. తడోబా టైగర్ రిజర్వ్ లో ఓ ఆడపులి, దాని 4 పిల్లలు ఆడుకోవడం చూస్తే ఎంతో మనోహరంగా అనిపించిందని వెల్లడించారు. ఈ పులుల సంరక్షణ కేంద్రంలో పర్యటించడాన్ని మరపురాని అనుభూతిగా భావిస్తానని, అందుకు సహకరించిన అక్కడి సిబ్బంది మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. ఓ ప్రత్యేక వాహనంలో సచిన్ ఇక్కడి అటవీప్రాంతంలో విహరించారు. తడోబా అంధారి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఉంది. దీన్ని 1995లో ఏర్పాటు చేశారు.

More Telugu News