Udhav Thackeray: మేం బీజేపీని ఏమడిగాం.. ఓ శివసైనికుడ్ని సీఎం చేయమని అడిగాం.. అంతేకదా!: ఉద్ధవ్ థాకరే

  • సామ్నా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఉద్ధవ్ 
  • ఇతర పార్టీలతో పొత్తు అనైతికం కాదని వ్యాఖ్యలు
  • బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదా? అంటూ నిలదీత 

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే శివసేన అధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలకు కారణం బీజేపీనే అని స్పష్టం చేశారు. తాము కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహా వికాస్ అఘాడీ కూటమి ఏర్పాటు చేయడం ఎలా అనైతికం అవుతుందని ప్రశ్నించారు. గతంలో బీజేపీ పొత్తుపెట్టుకోలేదా? అని నిలదీశారు.

"అయినా మేం బీజేపీని ఏం అడిగాం... నింగి నుంచి చంద్రుడ్ని తీసుకురమ్మన్నామా? లేక చుక్కల్ని తీసుకురమ్మన్మామా?... మా తండ్రి గారి కోరిక మేరకు ఓ శివసైనికుడ్ని సీఎం చేయమని అడిగాం" అంటూ బీజేపీపై విమర్శలు చేశారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే బీజేపీ తన మాట నిలబెట్టుకుని ఉంటే ఇవాళ తన స్థానంలో మరో శివ సైనికుడు సీఎం అయ్యుండేవాడని తెలిపారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీఎం పీఠం వద్ద సయోధ్య కుదరక శివసేనకు బీజేపీ దూరమైన సంగతి తెలిసిందే. ఆపై శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

More Telugu News