Naravaripalle: సభ జరిపింది రంగంపేటలో అయితే నారావారిపల్లెలో అని అబద్ధాలు చెబుతున్నారు: పంచుమర్తి అనురాధ

  • ఆదివారం చిత్తూరు జిల్లాలో వైసీపీ సభ
  • మండిపడుతున్న టీడీపీ నేతలు
  • వైసీపీ సభ జనాల్లేక వెలవెలపోయిందన్న పంచుమర్తి

చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతలు నిన్న సభ ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ స్పందించారు. సభ జరిపింది రంగంపేటలో అయితే నారావారిపల్లెలో సభ నిర్వహించాం అని వైసీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆదివారం నాడు వైసీపీ నిర్వహించిన సభ జనాల్లేక వెలవెలపోయిందని విమర్శించారు. అయినా నారావారిపల్లెలో సభ ఏర్పాటు చేసే దమ్ము చెవిరెడ్డికి ఎక్కడిదని పంచుమర్తి ఎద్దేవా చేశారు. జిల్లాలో ఇసుకదందాలను చెవిరెడ్డి తన సోదరుడి సాయంతో నిర్వహిస్తున్నారని, ఎర్రచందనం స్మగ్లర్లతోనూ సంబంధాలున్నాయని ఆరోపించారు. కావాలనే త్రిపుర నుంచి ఎస్పీని డిప్యుటేషన్ పై తెచ్చుకున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News