Rape: మేనకోడలిని గర్భవతిని చేసిన మేనమామ.. 12 ఏళ్ల శిక్షను విధించిన కోర్టు

  • మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం జరిపిన మేనమామ
  • ఫిర్యాదును బాధితురాలి తల్లి వెనక్కి తీసుకున్నా శిక్షను విధించిన కోర్టు
  • బాధితురాలి కుటుంబంతో రెండున్నర నెలలు గడిపిన నిందితుడు

మేనకోడలిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మేనమామ... ఆమె జీవితాన్ని చిదిమేశాడు. ముంబైకి చెందిన పదమూడేళ్ల మైనర్ బాలిక అయిన మేనకోడలిపై 27 ఏళ్ల మేనమామ పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. దీనికి సంబంధించి పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. అయితే, ఆ తర్వాత ఆమె ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. కానీ, వైద్యులు, పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన ముంబై ప్రత్యేక కోర్టు నిందితుడికి 12 ఏళ్ల కఠిన కారాగారశిక్షను విధించింది. బాధితురాలి కుటుంబంతో నిందితుడు రెండున్నర నెలలు గడిపాడని... ఆ సమయంలో ఆమెను పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

More Telugu News