Alapati Raja: వైసీపీ సభపై టీడీపీ నేత ఆలపాటి రాజా సెటైర్లు

  • కనీసం డెబ్బై నివాసాలు లేని చోట సభ పెట్టారు!
  • పైగా ఆ సభకు ఏడుగురు మంత్రులు కూడా 
  • మోస పూరిత బిల్లులతో మోసగిస్తున్నారు
చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెకు సమీపంలోని రంగంపేటలో వైసీపీ ఇవాళ నిర్వహించిన సభపై టీడీపీ నేత ఆలపాటి రాజా సెటైర్లు గుప్పించారు. కనీసం డెబ్బై నివాసాలు లేని చోట ఏడుగురు మంత్రులు సభ పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని చెప్పడం సిగ్గుచేటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిని విశాఖకు తరలిస్తే కనుక చిత్తూరు ప్రజలు అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనడం విడ్డూరంగా ఉందని అన్నారు. మోసపూరిత బిల్లులు, మాయ కమిటీలతో ప్రజలను మోసగిస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Alapati Raja
Telugudesam
YSRCP
capital
Vizag

More Telugu News