Amaravati: అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ సీఎం జగన్ లక్ష్యం: అజేయ కల్లాం

  • ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా తీర్చిదిద్దుతాం
  • ‘వికేంద్రీకరణ’ అనేది పరిణామక్రమంలో తప్పదు
  • సమన్యాయం చేయాలన్న ఆలోచనతోనే ‘వికేంద్రీకరణ’

సీఎం జగన్ ప్రత్యేక కార్యదర్శి అజేయ కల్లాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని నారావారిపల్లి సమీపంలో వైసీపీ బహిరంగ సభ ఈరోజు నిర్వహించారు. ఈ సభకు హాజరైన ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ సీఎం లక్ష్యం అని అన్నారు. ‘వికేంద్రీకరణ’ అనేది పరిణామక్రమంలో ఒక ప్రగతి సిద్ధాంతమని చెప్పారు. అభివృద్ధి అంతా ఒకేచోట ఉండాలన్న ఆలోచన కరెక్టు కాదని సూచించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా తీర్చిదిద్దుతామని, మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న ఆలోచనతోనే వికేంద్రీకరణ అని అన్నారు.

తెలంగాణ, రాయలసీమ వెనుకబడి ఉన్నాయని, కృష్ణా, గుంటూరు లు రాజధాని ఏర్పాటుకు అనుకూలం కాదని నాడు శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని గుర్తుచేశారు. రాజధాని అమరావతిలోఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఆ భూములన్నీ రైతుల చేతుల్లో కన్నా పెద్దపెద్దవాళ్లు, రాజకీయనాయకుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు జడ్జిలు, అడ్వొకేట్ జనరల్స్, కొంతమంది పత్రికాధిపతుల చేతుల్లో ఈ బినామీ భూములు ఉన్నాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News