samata: ఉరి శిక్షపై రేపు హైకోర్టును ఆశ్రయించనున్న 'సమత' దోషులు

  • దోషులకు కోర్టు విధించిన 26 వేల రూపాయల జరిమానా చెల్లింపు
  • రేపు ఉదయం హైకోర్టులో అప్పీల్ 
  • ఇటీవలే సమత కేసులో తీర్పు

కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన సమత హత్యాచారం కేసులో ముగ్గురు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఆదిలాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో దోషులు షేక్ బాబు, షాబుద్దీన్, ముగ్దుమ్‌ అప్పీల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించనున్నారు. మరోవైపు దోషులకు కోర్టు విధించిన 26 వేల రూపాయల జరిమానాను నిన్న వారి కుటుంబ సభ్యులు చెల్లించారు. వారు రేపు ఉదయం హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సమాచారం.

 సమత అత్యాచారం, హత్య కేసులో షేక్ బాబు, షాక్ షాబుద్దీన్, షేక్ మగ్దుమ్‌కి ఇప్పటికే ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. గతేడాది నవంబర్ 24న కొమురంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగింది. గ్రామాల్లో  బెలూన్లు అమ్ముకునే ఆమెపై ముగ్గురు మృగాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు.

  • Loading...

More Telugu News