YSRCP: ఇంకా చాలా చూడాలి.. కళ్లలో నిప్పులు పోసుకోకు బాబూ: విజయసాయిరెడ్డి

  • సంక్షేమ పెన్షన్లను ఒకటో తేదీన ఇచ్చే పద్ధతి దేశంలో ఎక్కడా లేదు
  • ఇచ్చినా బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లోనో తీసుకోవాల్సి ఉంటుంది
  • సీఎం జగన్ గారి ఆదేశాలతో ఒకటో తేదీన అందుతున్నాయి
  • వాలంటీర్లు పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తున్నారు 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజా సంక్షేమ పథకాల అమలుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా డబ్బు అందుతోందంటూ ట్వీట్ చేశారు. వీటన్నింటినీ చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

'సంక్షేమ పెన్షన్లను ఒకటో తేదీన ఇచ్చే పద్ధతి దేశంలో ఎక్కడా లేదు. ఇచ్చినా బ్యాంకుల్లోనో, పోస్టాఫీసుల్లోనో తీసుకోవాల్సి ఉంటుంది. సీఎం జగన్ గారి ఆదేశాలతో ఒకటో తేదీన వాలంటీర్లు పెన్షనర్ల ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తున్నారు. ఇంకా చాలా చూడాలి. కళ్లలో నిప్పులు పోసుకోకు బాబూ' అంటూ ట్వీట్ చేశారు.

YSRCP
Telugudesam
Vijay Sai Reddy

More Telugu News