SPG: ప్రధాని భద్రతకు మరిన్ని నిధులు.. ఎస్పీజీకి రూ.600 కోట్లు

  • ఎస్‌పీజీ నిధులను 11 శాతం మేర పెంచిన ప్రభుత్వం
  • రూ.540 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పెరిగిన నిధులు
  • సోనియా, రాహుల్, మన్మోహన్‌లకు గతేడాది ఎస్‌పీజీ భద్రత ఉపసంహరణ
ప్రధాని నరేంద్రమోదీ భద్రత మరింత పటిష్ఠం కానుంది. ఆయన రక్షణ బాధ్యతలు చూసుకునే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పీజీ)కి తాజా బడ్జెట్‌లో నిధులను 11 శాతం మేర పెంచారు. దీంతో ప్రస్తుతం కేటాయించిన రూ.540 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పెరిగింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు కూడా గతేడాది వరకు ఎస్‌పీజీ భద్రత ఉండేది. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం ఈ భద్రతను ఉపసంహరించింది. ప్రస్తుతం ప్రధాని మోదీకి మాత్రమే ఎస్‌పీజీ భద్రత ఉంది.
SPG
Union Budget 2020
Narendra Modi

More Telugu News