Corona Virus: కరోనాకు ఔషదం దొరికేసింది... వ్యాధి సోకిన వారిలో వందల మంది డిశ్చార్జ్: చైనా

  • ప్రపంచ దేశాలను వణికించిన కరోనా
  • 243 మందిని డిశ్చార్జ్ చేశాం
  • ఇక భయంలేదని చైనా అభయం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాకు విరుగుడు తమకు దొరికిందని చైనా ప్రకటించింది. కరోనా వైరస్ నుంచి బాధితులు కోలుకుంటున్నారని సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో, కరోనా వ్యాధి సోకిన వారిలో చికిత్స పొంది, 243 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది. ఇక వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా, కరోనా సోకి ఇప్పటివరకూ 259 మంది మరణించగా, మరో 11 వేల మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్సను పొందుతున్నారు. చైనా నుంచి వచ్చిన ప్రకటనతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News