YSRCP: నారావారి పల్లెలో.. రేపు వైసీపీ, టీడీపీ పోటాపోటీ సభలు!

  • వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ బహిరంగ సభ
  • వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ సభ
  • వైసీపీ సభకు మంత్రులు, ఎమ్మెల్యేల హాజరు  
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు రేపు పోటాపోటీగా సభలు నిర్వహించనున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి స్వస్థలం అయిన నారావారిపల్లె వేదికగా ఇవి జరగనున్నాయి. వికేంద్రీకరణకు మద్దతుగా చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని నారావారిపల్లెలో రేపు మధ్యాహ్నం వైసీపీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్టు సమాచారం. వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ కూడా మరో సభ నిర్వహించనుంది. నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సభ నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
YSRCP
Telugudesam
mla
chevireddy Bhasker reddy

More Telugu News