Nirbhaya: ‘నిర్భయ’ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పై రామ్ గోపాల్ వర్మ ఫైర్

  • ‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష వాయిదాపై వర్మ విమర్శ
  • న్యాయవాది ఏపీ సింగ్ పై విమర్శల వర్షం
  • ఈ దోషులకు ఉరిశిక్ష పడనివ్వనని సవాల్ చేస్తున్నాడు!
‘నిర్భయ’ కేసులో దోషులకు అమలు కావాల్సిన మరణశిక్ష మరోమారు వాయిదాపడ్డ విషయం తెలిసిందే. ఈ శిక్ష మూడోసారి వాయిదాపడటంపై సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు తమ వాణిని వినిపించారు. తాజాగా, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ, ‘నిర్భయ’ దోషుల పక్షాన వాదిస్తున్న న్యాయవాది ఏపీ సింగ్ పై విమర్శల వర్షం కురిపిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

ఈ సందర్భంగా ఏపీ సింగ్  గతంలో షేర్ చేసిన ఓ వీడియోను వర్మ పోస్ట్ చేశారు. నీతి నియమాలను ఉల్లంఘిస్తే తన కూతురినైనా సరే, కాల్చేస్తానని ఆ వీడియోలో ఏపీ సింగ్ మాట్లాడటం కనబడుతుంది. మురికి మనిషి ఏపీ సింగ్ ‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష పడనివ్వనని సవాల్ చేస్తున్నాడని.. తాను విన్న అత్యంత అసహ్యకరమైన విషయం ఇదేనంటూ వర్మ వరుస ట్వీట్లు చేశారు.
Nirbhaya
Advocate
AP Singh
Ramgopalvarma

More Telugu News