Nirmala Sitharaman: బడ్జెట్ ప్రసంగంలో నిర్మల సరికొత్త రికార్డు!

  • 2020 బడ్జెట్ సమర్పణ సందర్భంగా 2.42గంటల ప్రసంగం
  • 2019లో 2.15గంటలపాటు సాగిన ప్రసంగం
  • 2003లో జస్వంత్ సింగ్ 2.13గంటల ప్రసంగంతో రెండో స్థానం

కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్, లోక్ సభలో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెడుతూ.. చేసిన ప్రసంగం లోక్ సభ చరిత్రలో అతి సుదీర్ఘ కాలం సాగిన బడ్జెట్ ప్రసంగంగా నిలిచిపోనుంది. నిర్మల తన బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల 42 నిమిషాలపాటు కొనసాగించారు.

గత ఆర్థిక సంవత్సరం 2019-20 గాను పార్లమెంట్ లో బడ్జెట్ సమర్పిస్తూ ఆమె రెండుగంటల 15 నిమిషాలపాటు ప్రసంగించగా అప్పటికి అదే సుదీర్ఘకాలం సాగిన బడ్జెట్ ప్రసంగంగా గుర్తింపపొందగా, తాజాగా నిర్మల తన రికార్డును తానే తిరగరాసుకున్నారు.

అంతకుముందు.. 2003-04 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను సమర్పించిన అప్పటి ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ 2 గంటల 13 నిమిషాలపాటు ప్రసంగించి తర్వాతి స్థానంలో ఉండగా, మూడో స్థానంలో అరుణ్ జైట్లీ నిలిచారు. జైట్లీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పిస్తూ.. 2 గంటల 10 నిమిషాలపాటు ప్రసంగించారు.

More Telugu News