Lok Sabha: లోక్ సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్... ముఖ్యాంశాలు-2

  • నూతనంగా హై స్పీడ్ ట్రాక్ ల నిర్మాణం
  • 11 వేల కిలోమీటర్ల రైల్వే మార్గాల విద్యుద్దీకరణ
  • ఎస్సీలు, ఓబీసీల అభివృద్ధికి రూ. 85 వేల కోట్లు
  • బెంగళూరుకు సబర్బన్ రైల్వే ప్రాజెక్టు

ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్, నేడు తన రెండో బడ్జెట్ ను పార్లమెంట్ ముందు ఉంచారు. ఆమె ప్రతిపాదించిన 2020-21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్రతిపాదనల్లోని మరికొన్ని ముఖ్యాంశాలివి.

* జౌళి రంగానికి రూ. 1,480 కోట్ల కేటాయింపు.
* పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహానికి రూ. 27,300 కోట్లు.
* బెంగళూరుకు రూ. 18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్ రైల్వే పథకం.
* ఈ ప్రాజెక్టుకు 20 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర నిధులు, 60 శాతం నిధుల సమీకరణ.
* రవాణా, మౌలిక వసతుల అభివృద్ధికి రూ. 1.70 లక్షల కోట్లు.
* రూ. 1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో కొత్త ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు.
* 11 వేల కిలోమీటర్ల మేరకు రైల్వే మార్గాల విద్యుద్దీకరణ.
* రైల్వే ట్రాక్ ల వెంబడి సోలార్ విద్యుత్ కేంద్రాలు.
* ముంబై - అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైల్వే లైన్ నిర్మాణం వేగవంతం.
* పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఇచ్చేలా మరిన్ని తేజస్ రైళ్లు.
* ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 150 నూతన రైళ్లు.
* 2023 నాటికి చెన్నై - ముంబై, చెన్నై - బెంగళూరు ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం.
* భారత్ నెట్ పథకానికి రూ. 6 వేల కోట్లు.
* పౌష్టికాహారానికి రూ. 35,600 వేల కోట్లు.
* మహిళా సంక్షేమానికి రూ. 28,600 కోట్లు.
* ఎస్టీల అభివృద్ధికి రూ. 53,700 కోట్లు.
* ఎస్సీల, ఓబీసీల అభివృద్ధికి రూ. 85 వేల కోట్లు.
* సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు రూ. 9,500 కోట్లు.
* విద్యుత్ రంగానికి రూ. 22 వేల కోట్లు.
* నైపుణ్య శిక్షణకు రూ. 3 వేల కోట్లు.
* నేషనల్ మిషన్ ఫర్ క్వాంటమ్ టెక్నాలజీస్ కు రూ. 8 వేల కోట్లు.
* నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ. 4,400 కోట్లు.
* పర్యాటక రంగ అభివృద్ధికి రూ. 2 వేల కోట్లు.
* ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 3.50 లక్షల కోట్ల మూలధన సాయం.
* డిపాజిటర్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు చర్యలు.
* డిపాజిటర్ల బీమా కవరేజ్ రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంపు.
* కంపెనీల చట్టంలో అతి త్వరలో మార్పులు.
* లడఖ్ అభివృద్ధికి రూ. 5,958 కోట్లు.
* జమ్మూ కశ్మీర్ సంక్షేమానికి రూ. 30,757 కోట్లు.
* ప్రతి ఇంటి గడపకూ విద్యుత్ తీసుకెళ్లి అతిపెద్ద విజయం సాధించాం.
* నదీతీరాల వెంబడి అభివృద్ధి కార్యకలాపాలకు ప్రోత్సాహం.
* నేషనల్ గ్యాస్ గ్రిడ్ ను 16,300 కిలోమీటర్ల నుంచి 27 వేల కిలోమీటర్లకు విస్తరించేందుకు చర్యలు.
* 2024 నాటికి దేశంలో కొత్తగా 100 ఎయిర్ పోర్టులు.
* వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా విద్యుత్ ప్రీ పెయిడ్ మీటర్లు.
* దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు నిర్ణయం.
* యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం.
* ఉద్యోగాల కల్పనకు ముందుకు వచ్చే స్థాయికి తేవడమే లక్ష్యం.
* పెట్టుబడి పెట్టే ముందే తగు శిక్షణ, అవకాశాలపై అవగాహన కల్పించే కేంద్రాల ఏర్పాటు.
* నూతన పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు ప్రత్యేక విభాగం.
* ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిచ్చేలా కొత్త స్కీమ్ లు.
* మొబైల్స్, తయారీ, సెమీ కండక్టర్ పరిశ్రమలపై త్వరలోనే నూతన విధివిధానాల ఖరారు.
* రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా 5 ఆకర్షణీయ నగరాలు.
* జౌళి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక విభాగం.
* జాతీయ జౌళి సాంకేతిక మిషన్ ద్వారా కొత్త పథకం.
* చిన్న తరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్ పేరిట సరికొత్త బీమా స్కీమ్.
* ప్రతి జిల్లానూ ఓ ఎక్స్ పోర్ట్ హబ్ గా మార్చాలన్నదే ప్రభుత్వ ఆశయం.
* మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యలక్ష్మీ పథకం అమలు.
* అంతర్జాతీయ వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక మండళ్ల ఏర్పాటు.
* రాష్ట్రాల స్థాయిలో విద్యుత్ బిల్లులు, రవాణా వ్యయం, వ్యాట్, ఇతర పన్నుల నుంచి ఊరటనిచ్చేలా చర్యలు.
* త్వరలోనే జాతీయ సరకు రవాణా విధానం.
* రెండు వేల కిలోమీటర్ల ల్యాండ్ టూ పోర్ట్ రూట్ కు రహదారుల అనుసంధానం.
* రూ. 1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో కొత్త ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు.
* ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఫైనాన్షియల్ టెక్నాలజీ విభాగాల్లో మరిన్ని సంస్కరణలు.
* లక్ష గ్రామాలకు ఓఎఫ్సీ ద్వారా డిజిటల్ కనెక్టివిటీ.
* జాతీయ గ్రిడ్ తో లక్ష గ్రామాల అనుసంధానం.
* అంగన్వాడీలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, పోలీస్ స్టేషన్లకు డిజిటల్ అనుసంధానం.
* బేటీ బచావో - బేటీ పఢావో గొప్ప విజయం సాధించింది.
* పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ ముందున్న బాలికలు.
* బాలలకు పౌష్టికాహారం అందించేందుకు మరిన్ని నిధులు.
* 9 వేల కిలోమీటర్ల పొడవున ఎకనామిక్ కారిడార్ ఏర్పాటు.
* మేధోహక్కుల పరిరక్షణకు పెద్దపీట.
* వారసత్వ పరిరక్షణకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ ఏర్పాటు.
* దేశవ్యాప్తంగా 5 పురావస్తు కేంద్రాల ఆధునికీకరణ, అభివృద్ధి.
* హరియాణాలోని రాఖీగడ, యూపీలోని హస్తినాపూర్, అసోంలోని శివసాగర్, గుజరాత్ లోని డోలావీర, తమిళనాడులోని ఆదిత్య నల్లూరు అభివృద్ధి.
* ఝార్ఖండ్ లోని రాంచీలో పురావస్తు గిరిజన ప్రదర్శనశాల.
* సఫాయీ కర్మచారి విధానానికి స్వస్తి.
* వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ పర్యావరణ పరిరక్షణ.
* పారిస్ ఒప్పందానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణా చర్యలు.
* పాత ధర్మల్ కేంద్రాలు తమ కర్బన ఉద్గారాలను తగ్గించుకోకుంటే చర్యలు.
* జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం.
* అవినీతి రహిత పాలనను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం.
* వ్యాపార వర్గాల్లో నమ్మకం పెంచేలా పన్ను చెల్లింపు చార్టర్.
* పన్ను చెల్లింపుదారులపై వేధింపులకు స్వస్తి చెప్పే విధానం.
* పన్ను చెల్లించని వారిపై ఉండే క్రిమినల్ శిక్షలు ఇక సివిల్ విధానానికి మార్చేందుకు చర్యలు.
* సివిల్ విధానంలో మార్పులకు త్వరలోనే చట్ట సవరణ.
* నాన్ గెజిటెడ్ పోస్టులకు జాతీయ స్థాయిలో రిక్రూట్ మెంట్ ఏజెన్సీ.
* సమాజంలో అట్టడుగు వర్గాలకు ఆర్థిక స్వావలంబన దిశగా చర్యలు.
* నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం.

More Telugu News