బడ్జెట్ వచ్చేసింది... లోక్ సభకు చేరుకున్న నిర్మలమ్మ!
- ఎన్డీయే ప్రభుత్వంలో రెండో విడత బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
- ఇప్పటికే ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్
- మధ్యతరగతికి ఊరట కలిగించేలా కొన్ని నిర్ణయాలు
కాగా, మధ్య తరగతికి ఊరట కలిగించేలా కొన్ని నిర్ణయాలను నిర్మలమ్మ ప్రతిపాదించ వచ్చని ఆర్థిక వర్గాలు ఇప్పటికే అభిప్రాయపడ్డాయి. పన్ను రాయితీలను పెంచుతూ ఆమె నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదే సమయంలో మేకిన్ ఇండియాకు ఊతమిచ్చేలా, ఉత్పత్తి రంగానికి రాయితీలను ఆమె సిద్ధం చేశారని, తగ్గుతున్న ఆర్థిక వృద్ధిని తిరిగి గాడిలో పడేసేందుకు నిర్ణయాలతో పాటు, కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచేలా నిర్ణయాలను ప్రకటించనున్నారని తెలుస్తోంది.
ఇదిలావుండగా, ఈ సంవత్సరం రక్షణ రంగానికి కేటాయింపులు మరింతగా పెరుగుతాయని కూడా తెలుస్తోంది. ద్రవ్యలోటు కట్టడి కీలకమైన నేపథ్యంలో, ఎగుమతులపైనా పన్నులను పెంచనున్నారని సమాచారం.