BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీ నేతల హామీలు

  • ‘ఢిల్లీ సంకల్ప పత్ర’ పేర మేనిఫెస్టో విడుదల
  • పేదలకు రూ.2కే కిలో గోధుమ పిండి
  • కాలేజీ విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. బీజేపీ ఓటర్లను ఆకట్టుకునే విధంగా తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘ఢిల్లీ సంకల్ప పత్ర’ పేర దీన్ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవదేకర్, హర్షవర్ధన్, పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీలు హాజరయ్యారు. ఈ మేనిఫెస్టో విషయాలను తివారీ వెల్లడిస్తూ.. తమ  పార్టీ గెలిస్తే.. కేంద్రం అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని అమలుచేస్తామన్నారు.

కాలేజీ విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు, పాఠశాల పిల్లలకు సైకిల్స్ పంపిణి చేస్తామని తివారీ చెప్పారు. పేదలు గోధుమలు కూడా కొనుక్కోలేకపోతున్నారని, తాము అధికారంలోకి రాగానే వారికి రెండు రూపాయలకే కిలో గోధుమ పిండిని సరఫరా చేస్తామన్నారు. ప్రతీ ఇంటికీ రక్షిత మంచినీటిని అందిస్తామన్నారు. ఢిల్లీలో బుల్లెట్ రైలును ప్రవేశపెడతామని మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ భవిష్యత్తును మార్చి వేస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News