Amaravati: రాజధాని ప్రాంత రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు

  • రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఎంపీ
  • వారికి న్యాయం చేసే ప్రక్రియ మొదలు పెడతాం
  • రైతులకు అన్యాయం జరగనీయమని భరోసా
రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు వైసీపీ ఎంపీ కృష్ణ దేవరాయలు చేరుకుని వారికి సంఘీభావం ప్రకటించారు. మందడంలో ఆయన రైతు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. రైతులకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ప్రకటించారు.  రైతులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. త్వరలోనే వారికి న్యాయం చేసే ప్రక్రియ మెుదలు పెడతామని ఎంపీ అన్నారు.

ప్రభుత్వం ఏదైనా కమిటీ వేసి అభిప్రాయాలు కోరితే.. రైతులు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పవచ్చని కృష్ణ దేవరాయలు ఈ సందర్భంగా  రైతులతో అన్నట్లు తెలుస్తోంది. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనీయమని రైతులకు భరోసా కల్పించారు. ఇదిలావుండగా, రాజధాని తరలింపును నిరసిస్తూ.. అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన దీక్ష 44వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు దీక్షా శిబిరాన్ని సందర్శించిన తొలి వైసీపీ నేత కృష్ణ దేవరాయలనే చెప్పాలి. 
Amaravati
Deeksha
YSRCP
MP
Krishna Devarayalu

More Telugu News