Tammineni Sitaram: కృత్రిమ ఉద్యమాలపై నేను స్పందించను: స్పీకర్ తమ్మినేని సీతారాం

  • నిజంగా ప్రజా ఉద్యమాలు జరిగితే మద్దతిద్దాం
  • మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించాం
  • అన్నీ చట్ట ప్రకారమే జరుగుతాయి

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ చేసిన తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా స్పందించారు. మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించామన్నారు. అన్నీ చట్ట ప్రకారమే జరుగుతాయన్నారు. చట్టం ఏ ఒక్కరికీ చుట్టం కాదన్నారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్టీఆర్ హయాంలోనూ మండలి రద్దు జరిగింది. ఓపక్క రాజధాని ప్రాంత రైతులతో ప్రభుత్వం వేసిన కమిటీ చర్చిస్తోంది. రైతులతో పాటు రైతు కూలీలకు కూడా పెన్షన్ ఇస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఉద్యమాల గురించి నేను మాట్లాడను. నిజంగా ప్రజాఉద్యమం కనుక జరిగితే అందరం మద్దతిద్దాం' అన్నారు స్పీకర్ తమ్మినేని.

More Telugu News