Jagan: సీఎంగా ప్రతి నిమిషం రాష్ట్రం కోసం సమయం కేటాయించాల్సి ఉంది: పిటిషన్‌లో పేర్కొన్న జగన్‌

  • తెలంగాణ హైకోర్టులో జగన్‌ పిటిషన్‌
  • అక్రమాస్తుల కేసులో మినహాయింపు ఇవ్వాలని వినతి
  • తనకు బదులుగా సహనిందితులు హాజరయ్యేందుకు అనుమతించాలన్న సీఎం
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఇటీవల స్పష్టం చేసినప్పటికీ ఆయన హాజరు కాలేదన్న విషయం తెలిసిందే. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్‌.. పలు అంశాలను అందులో పేర్కొన్నారు. సీఎంగా ప్రతి నిమిషం రాష్ట్రం కోసం కేటాయించాల్సి ఉందని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. తనకు బదులుగా సహ నిందితులు హాజరయ్యేందుకు అనుమతించాలని ఆయన వినతి చేసుకున్నారు. 
Jagan
YSRCP
Telugudesam
High Court

More Telugu News