Uttar Pradesh: యూపీ ఉన్మాది భార్యను రాళ్లతో కొట్టి చంపిన స్థానికులు!

  • తీవ్ర కలకలం రేపిన ఫరూఖాబాద్ ఘటన
  • చిన్నారులను బంధించిన ఉన్మాది
  • దుండగుడ్ని కాల్చిచంపిన పోలీసులు
  • పారిపోయేందుకు ప్రయత్నించిన ఉన్మాది భార్యపై రాళ్ల దాడి
ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో ఓ ఉన్మాది తన నివాసంలో 20 మంది చిన్నారులను బంధించిన ఘటన తెలిసిందే. ఆ ఉన్మాదిని స్పెషల్ ఆపరేషన్ ద్వారా పోలీసులు హతమార్చగా, అతడి భార్యను స్థానికులు రాళ్లతో కొట్టి చంపారు. సుభాష్ బాథమ్ అనే వ్యక్తి తన కుమార్తె బర్త్ డే అని చెప్పి 20 మంది పిల్లల్ని పిలిచి తన ఇంట్లో నిర్బంధించడం నిన్న సాయంత్రం యూపీలో తీవ్ర కలకలం రేపింది. అతడు పోలీసులపైనే కాల్పులు జరపడంతో, ప్రత్యేక దళాల సాయంతో అతడిని మట్టుబెట్టారు. ఈ క్రమంలో అతడి భార్య పారిపోయేందుకు ప్రయత్నించడంతో స్థానికులు ఆమెపైకి రాళ్లు విసిరారు. తీవ్రగాయాలపాలైన ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
Uttar Pradesh
Psycho
Farukhabad
Children
Police

More Telugu News