లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

  • రేపు కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మల
  • 2020-21లో వృద్ధి రేటు అంచనా 6 నుంచి 6.5 శాతం మధ్య
  • లోక్‌సభ రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా
ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రేపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆమె లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనా 6 నుంచి 6.5 శాతం మధ్య ఉందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక పరిస్థితులను ఈ సర్వేలో పొందుపర్చారు. సర్వేలోని పూర్తి వివరాలు కాసేపట్లో మీడియాకు అందనున్నాయి. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.
Go Back to Shorts
BJP
Union Budget 2020
Nirmala Sitharaman

More Telugu News