Jammu And Kashmir: జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల్ని కాల్చిచంపిన భద్రతా బలగాలు

  • జమ్ము- శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ఘటన
  • బన్నా టోల్‌ప్లాజా వద్ద వాహనాల తనిఖీ
  • ఉగ్రవాదుల కాల్పులతో పోలీసులు ఎదురు కాల్పులు
జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని జమ్ము- శ్రీనగర్‌ జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బన్నాటోల్‌ ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఓ వాహనంలో ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని జమ్ము ఐజీ ముకేష్‌ సింగ్‌ తెలిపారు. వీరి వద్ద నుంచి ఏకే 47 తుపాకీ, మ్యాగ్‌జైన్‌, గ్రేనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు కథువా, హీరానగర్‌ సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు.
Jammu And Kashmir
terrorists
firing
three dead

More Telugu News