Visakhapatnam: విశాఖ ఏదో అగ్నిపర్వతం అంచున ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారు: విజయసాయిరెడ్డి

  • విశాఖ అంశంపై స్పందించిన విజయసాయిరెడ్డి
  • ఉత్తరాంధ్ర ప్రజలపై నిప్పులు పోసుకుంటున్నారెందుకంటూ బాబుపై ఆగ్రహం
  • ముంబయి, చెన్నైలకు కూడా తుపాను తాకిడి ఉందని వ్యాఖ్యలు
ఏపీ రాజధానిగా విశాఖ అంశంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. జీవనోపాధి లేక ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళుతుంటే, వాళ్లపై నిప్పులు పోసుకుంటున్నారెందుకు? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. ఈనాడు, చంద్రజ్యోతిలతో జీఎన్ రావు కమిటీని వక్రీకరించే రాతలు రాయించారని ఆరోపించారు. ఒక్క విశాఖకు మాత్రమే కాదు ముంబయి, చెన్నై నగరాలకు కూడా తుపాను తాకిడి ఉందని విజయసాయి తెలిపారు. విశాఖ ఏదో అగ్నిపర్వతం అంచున ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
Visakhapatnam
Vijay Sai Reddy
AP Capital
Chandrababu
Eenadu
Chandrajyothy
Mumbai
Chennai

More Telugu News