Lok Sabha: నిరసనల పేరుతో హింస సరికాదు: పార్లమెంటులో రాష్ట్రపతి కోవింద్
- ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చుతోంది
- ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అనేక కొత్త చట్టాలను తీసుకొచ్చింది
- సులభతర వాణిజ్య విధానంలో భారత్‌కు మెరుగైన ర్యాంకు వచ్చింది
- ముస్లిం మహిళలకు న్యాయం చేసేలా ట్రిపుల్ తలాక్ రద్దు చేసింది
అయోధ్యలో రామ జన్మభూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ ప్రజలు చూపిన ఔన్నత్యం ప్రశంసనీయమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. పార్లమెంటు బడ్డెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చుతోందని అన్నారు.
ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అనేక కొత్త చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని కోవింద్ చెప్పారు. సులభతర వాణిజ్య విధానంలో భారత్ మెరుగైన ర్యాంకును సాధించిందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో 370, 35ఏ అధికరణలను రద్దు చేయడం కేవలం ఓ చారిత్రాత్మక నిర్ణయం మాత్రమేకాదని, జమ్ముకశ్మీర్, లఢక్ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మార్గం సుగమమైందని ఆయన చెప్పారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసేలా ట్రిపుల్ తలాక్ రద్దు చేసిందన్నారు.
దేశ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని కోవింద్ అన్నారు. అందరితో అందరి అభివృద్ధి కోసం అనే నినాదంతో పనిచేస్తోందని చెప్పారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. నిరసనల పేరుతో ఏ రూపంలో హింస జరిగినా సరికాదని, సమాజాన్ని, దేశాన్ని అవి బలహీనపరుస్తాయని చెప్పారు.