Janasena: జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా సరైన నిర్ణయం కాదేమో: ఐవైఆర్

  • ఏపీలో జనసేన, బీజేపీ కలిశాయి
  • తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాయి
  • ఈ తరుణంలో జనసేన నుంచి రాజీనామా సరైన నిర్ణయం కాదేమో 
  • కూటమి బలపడటానికి ప్రయత్నించి ఉంటే బాగుండేది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమా రంగంలోకి వెళ్లడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన తీరుపై ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్న ఈ తరుణంలో జనసేన నుంచి వీరి రాజీనామా సరైన నిర్ణయం కాదేమోనని నా అభిప్రాయం. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తృతీయ కూటమి బలపడటానికి ప్రయత్నించి ఉంటే బాగుండేది' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.
Janasena
laxmi narayana
IYR Krishna Rao

More Telugu News