వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రజలపై బాదుడు పెరిగింది: కళా వెంకట్రావు

30-01-2020 Thu 18:48
  • మద్యం, ఇసుక రేట్ల పెంపుతో వందల కోట్ల భారం
  • ట్యాక్స్ పేరుతో పెట్రో ధరలు పెంచారని ఆరోపణ
  • జగన్ సీఎం అయ్యాక 28 పథకాలు రద్దు చేశారని వెల్లడి
ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పన్నుల బాదుడు పెరిగిందని అన్నారు. మద్యం, ఇసుక రేట్ల పెంపుతో వందల కోట్ల భారం పడుతుందని తెలిపారు. ట్యాక్స్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారని ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక 28 పథకాలను రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు.