Balakrishna: సొంత నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణకు ఎదురైన నిరసనలు.. ఉద్రిక్తత!

  • హిందూపురంలో కాన్వాయ్‌ను అడ్డుకున్న స్థానికులు
  • అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారంటూ నినాదాలు  
  • రాయలసీమ ద్రోహి అంటూ, వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు  
తన సొంత నియోజక వర్గం హిందూపురం‌లో టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్న స్థానికులు... అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

రాయలసీమలో హైకోర్టును బాలకృష్ణ అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు గుప్పించారు. ఆయనను రాయలసీమ ద్రోహి అంటూ, వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణకు మద్దతుగా నిలిచారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Balakrishna
Telugudesam
Anantapur District

More Telugu News