YSRCP: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో 9 అంశాలను లేవనెత్తిన వైసీపీ.. కేంద్రం ముందు డిమాండ్లు

  • పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం
  • పాల్గొన్న వైసీపీ ఎంపీలు  
  • ప్రత్యేక హోదా ఇవ్వాలి 
  • వెనకబడిన జిల్లాలకు రూ.23 వేల కోట్లివ్వాలి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ లేవనెత్తింది. న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న వైసీపీ ఎంపీలు.. ఏపీకి హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఏపీకి రావాల్సిన పెండింగ్‌ గ్రాంట్ల విడుదలతో పాటు మరో ఎనిమిది అంశాలను లేవనెత్తారు.

ఈ మేరకు మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డితో పాటు పలువురు కేంద్రానికి వినతి చేసి, వాటి వివరాలు తెలిపారు. వెనకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,283 కోట్లను రీయింబర్స్‌మెంట్‌ చేయాలని కోరారు. రాజధాని నగర అభివృద్ధి కోసం గ్రాంట్‌గా రూ. రూ.47,424 కోట్లు ఇవ్వాలని, అలాగే, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.
YSRCP
Telugudesam
New Delhi
Vijay Sai Reddy

More Telugu News