China: సాధించిన చైనా... 48 గంటల్లోనే 1000 పడకల ఆసుపత్రి సిద్ధం!

  • వూహాన్ లో ఆసుపత్రి నిర్మాణం
  • రోగులకు సేవలను ప్రారంభించిన వైద్యులు
  • మరో నాలుగు భవనాలు నిర్మించాలని చైనా నిర్ణయం

చైనా తన శ్రామిక శక్తిని మరోసారి ప్రపంచానికి చాటింది. కేవలం 48 గంటల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించింది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో కరోనా వైరస్ వెలుగుచూసిన వూహాన్ కు సమీపంలో నిర్మితమైన ఈ ఆసుపత్రికి డెబీ మౌంటెన్ రీజనల్ మెడికల్ సెంటర్ అని పేరు పెట్టారు. గత రాత్రి 10.30 గంటల నుంచి ఆసుపత్రి సేవలను అందించడం ప్రారంభించిందని అధికారులు తెలిపారు. వాస్తవానికి ఇక్కడి ఆసుపత్రిని మే నెలలో ప్రారంభించాలని ప్రభుత్వం భావించినా, కరోనా తీవ్రత దృష్ట్యా తక్షణమే అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది.

దీంతో వందలాది మంది కార్మికులు, పోలీసులు భవనాన్ని పూర్తి చేసేందుకు శ్రమించారు. ఇటువంటివే మరో నాలుగు ఆసుపత్రి భవనాలను నిర్మించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఆగమేఘాల మీద భవనాలను సిద్ధం చేయడం చైనాకు అలవాటే. 2003లో సార్స్ వైరస్ వెలుగులోకి వచ్చిన వేళ, బీజింగ్ లో ఏడు రోజుల్లోనే కొత్త ఆసుపత్రిని చైనా నిర్మించింది.

  • Loading...

More Telugu News