AP Fishermen: ఏపీ మత్స్యకారులను విడుదల చేసిన బంగ్లాదేశ్

  • నాలుగు నెలలుగా బంగ్లాదేశ్ లో బందీలుగా ఏపీ మత్స్యకారులు
  • చేపల వేటకు వెళ్లి పొరబాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశం
  • కేంద్రం చొరవ తీసుకోవడంతో మత్స్యకారుల విడుదల

నాలుగు నెలల క్రితం బంగాళాఖాతంలో చేపలను వేటాడుతూ బంగ్లాదేశ్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించి బందీలైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 8 మంది మత్స్యకారులు విడుదల అయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 27న బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన వీరు పొరబాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో ఆ దేశ తీరప్రాంత సిబ్బంది వీరిని బందీలుగా చేసింది. వీరిని అక్రమ చొరబాటుదారులుగా పేర్కొంటూ.. కేసులు నమోదు చేసి జైళ్లలో పెట్టారు.

బందీలంతా శ్రీకాకుళం. విజయనగరం జిల్లాల్లకు చెందిన వారే. వీరి విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతి చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు చేపట్టింది. మత్స్య కారులను విడిచిపెట్టాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ పలుమార్లు బంగ్లా ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో బంగ్లా అధికారులు మత్స్యకారులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే మత్స్యకారులు తమ స్వస్థలాలకు చేరుకోనున్నారు.

More Telugu News