Hamilton: హామిల్టన్ లో అసలైన మజా.... సూపర్ ఓవర్ లో చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన రోహిత్

  • మూడో టి20లో స్కోర్లు సమం
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్... స్కోరు 179/5
  • చేజింగ్ లో సరిగ్గా 179 పరుగులు చేసిన కివీస్
  • సూపర్ ఓవర్ కు దారితీసిన మ్యాచ్

టి20 క్రికెట్లోని అసలు సిసలు మజా ఏంటో హామిల్టన్ లో టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆవిష్కృతమైంది. మ్యాచ్ లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ కు దారితీయగా, చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగా, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ భారీ సిక్సర్ కొట్టి టీమిండియాను గెలిపించాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్లకు 179 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 6 వికెట్లకు 179 పరుగులే చేసింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడి 95 పరుగులు చేశాడు. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు.

కివీస్ తరఫున విలియమ్సన్, గప్టిల్ బరిలో దిగి 6 బంతుల్లో 17 పరుగులు చేశారు. ఆపై 18 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన రోహిత్, రాహుల్ జోడీ పోరాటపటిమ చూపించడం మ్యాచ్ భారత్ వశమైంది. రోహిత్ వరుసగా 5, 6వ బంతులను స్టాండ్స్ లోకి పంపడంతో భారత్ గెలుపుతీరాలకు చేరింది. ఈ మ్యాచ్ విజయంతో 5 టి20ల సిరీస్ ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నాలుగో టి20 జనవరి 31న వెల్లింగ్టన్ లో జరగనుంది.

More Telugu News