Corona Virus: కరోనా వైరస్ చైనా పుట్టించిన జీవాయుధమా? ఆ దేశ స్వయంకృతాపరాధమా?: బోలెడు సందేహాలు

  • వూహాన్ ల్యాబ్ లోని పీ4 ల్యాబ్ నుంచి లీకైన వైరస్
  • చైనా తీరు అనుమానాస్పదం
  • సంచలన కథనాన్ని ప్రచురించిన ఓ వార్తా సంస్థ

చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ఆ దేశ సరిహద్దులను దాటి ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ మహమ్మారి సముద్రపు జీవుల నుంచి పుట్టిందని, గబ్బిలాల నుంచి వ్యాపించిందనే కథనాలు వచ్చాయి. తాజగా ఓ వార్తా సంస్థ వెల్లడించిన విషయం ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేస్తోంది. కరోనా వైరస్ అనేది సహజంగా పుట్టుకొచ్చిన వైరస్ కాదని... అది చైనా సృష్టించిన జీవాయుధం అనేది ఆ కథనం సారాశం.

కరోనా వైరస్ పంజా విసిరిన వూహాన్ లోని పీ4 ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు ఈ వైరస్ లీక్ అయిందని సదరు వార్తా సంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ త్వరలోనే అంగీకరిస్తుందని కూడా పేర్కొంది. వూహాన్ లోని సముద్ర జీవుల మార్కెట్ కు కేవలం 20 మైళ్ల దూరంలోనే పీ4 ల్యాబ్ ఉంది. ప్రపంచాన్ని వణికించిన సార్స్ తదితర వైరస్ ల నమూనాలను ఈ ల్యాబ్ లోనే భద్రపరిచారు. కొత్త వ్యాధులను అరికట్టేందుకు ఇక్కడ పరిశోధనలు చేస్తుంటారు.

ఈ ల్యాబ్ లోనే కొత్త రకమైన కరోనా వైరస్ ను సృష్టించారని, ప్రమాదవశాత్తు అది లీక్ అయిందని సదరు వార్తా సంస్థ తెలిపింది. కరోనా పుట్టుకొచ్చిన తొలి రోజుల్లో చైనా అనుమానాస్పదంగా వ్యవహరించిందని పేర్కొంది. తొలి కేసు నమోదైనప్పుడు వూహాన్ లో చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ కిషాన్ రహస్యంగా పర్యటించారని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయాన్ని కూడా చైనా ప్రభుత్వం తిరస్కరించిందని తెలిపింది. దీంతో, ఈ వైరస్ పై అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోవడం గమనార్హం.

More Telugu News