Shahrukh Khan: పాకిస్థాన్ లో షారుఖ్ ఖాన్ బంధువు మృతి

  • పెషావర్ లో తండ్రి తరపు బంధువు నూర్జహాన్ మృతి
  • రాజకీయాల్లో చురుకుగా ఉన్న నూర్జహాన్
  • క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూత
పాకిస్థాన్ లోని పెషావర్ లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ బంధువు నూర్జహాన్ మృతి చెందారు. షారుఖ్ కు తండ్రి తరపున ఆమె బంధువు అవుతారు. ఆమె మరణించిన విషయాన్ని కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. ఈ సందర్భంగా ఆమె తమ్ముడు మన్సూర్ అహ్మద్ మాట్లాడుతూ, గత కొంత కాలంగా నూర్జహాన్ క్యాన్సర్ తో బాధపడుతోందని చెప్పారు. ఆమె మరణించినట్టు పెషావర్ కౌన్సిల్ మెంబర్ జుల్ఫికర్ కూడా ప్రకటించారు.

జియో న్యూస్ కథనం ప్రకారం తన తల్లిదండ్రులు లతీఫ్ ఫాతిమా ఖాన్, తాజ్ మొహమ్మద్ ఖాన్ లతో కలిసి రెండు సార్లు పెషావర్ కు షారుఖ్ వెళ్లారు. నూర్జహాన్ కూడా రెండు సార్లు ఇండియాకు వచ్చి షారుఖ్ ను కలిసింది. షారుఖ్ తో పాటు ఇండియాలో ఉన్న బంధువులు అందరితో ఆమె కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

రాజకీయాల్లో కూడా నూర్జహాన్ చురుకుగా పాల్గొన్నారు. జిల్లా, టౌన్ కౌన్సిలర్ గా ఆమె బాధ్యతలను నిర్వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె నామినేషన్ కూడా వేశారు. అయితే, చివర్లో ఆమె తన నామినేషన్ ను విరమించుకున్నారు.
Shahrukh Khan
Paternal Cousin
Noor Jehan
Peshawar
Pakistan
Bollywood

More Telugu News