physical workouts: వ్యాయామానికి ఏడే నిమిషాలు...బిజీగా ఉండే వారికి భలే 'వర్కవుట్స్' !

  • అందుబాటులోకి కొత్త యాప్ 
  • పనిఒత్తిడితో సమయం లేదనుకునే వారికి ప్రత్యేకం 
  • ఒక్కో వర్కవుట్ 30 సెకన్లు మాత్రమే

ఇప్పుడంతా పరుగు నడకా జీవితం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పని ఒత్తిడితో సతమతమయ్యేవారు ఎందరో. 'కనీసం కాసేపు వ్యాయామం చేద్దామన్నా వీలు కుదరడం లేదు' అంటూ చాలా మంది వాపోతుంటారు. అయితే ఇకపై మీకు ఆ చింత ఆక్కర్లేదు. ఇలా కాఫీ తాగినంత సమయం కేటాయిస్తే అద్భుతమైన వ్యాయామ సూత్రాలు మీ ముందుంటాయి.

అదెలా అనుకుంటున్నారా? మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ప్లేస్టోర్ లోకి వెళ్లి 'సెవెన్ మినిట్ వర్కవుట్ యాప్' ఇన్ స్టాల్ చేసుకోండి. ఇందులో 13 రకాల వ్యాయామ సూత్రాలు ఉన్నాయి. ఒక్కోదానికి పట్టే సమయం 30 సెకన్లు మాత్రమే. అంటే 6.30 నిమిషాలు. మిగిలిన సమయాన్ని ప్రతి వర్కవుట్ మధ్య విశ్రాంతికి కేటాయించవచ్చు. భలేగా ఉంది అని అనుకుంటున్నారా? 

అంతేకాదండోయ్.. ఇందులో ఇంకో సౌలభ్యం కూడా ఉంది. సింపుల్ వర్కవుట్స్ కాబట్టి మీ సమయానుకూలతలను బట్టి రోజుకి రెండు మూడుసార్లు చేసినా మంచిదే. ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. కాసేపు వ్యాయామం చేస్తే రోజంతా హాయిగా, ప్రశాంతంగా ఉండొచ్చుమరి.

  • Loading...

More Telugu News