Chandrababu: చంద్రబాబు నేటి తెనాలి పర్యటన వాయిదా.. కారణం చెప్పిన ఆలపాటి రాజా

  • ఫిబ్రవరి తొలి వారానికి పర్యటన వాయిదా
  • ప్రశాంతతను పాడుజేసే ఉద్దేశం లేదు
  • సమస్య ఏ ఒక్క పార్టీదో కాదన్న ఆలపాటి
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి నేటి తెనాలి పర్యటన వాయిదా పడింది. పట్టణంలో నేడు చంద్రబాబు బహిరంగ సభ జరగాల్సి ఉంది. అయితే, 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రశాంతతను పాడుజేసే ఉద్దేశం లేకే పర్యటనను వాయిదా వేసినట్టు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. నిన్న ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

అమరావతిపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. మండలి రద్దు, మారుతున్న పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటనను వాయిదా వేశామని, ఫిబ్రవరి తొలి వారంలో బాబు పర్యటన ఉంటుందని తెలిపారు. అమరావతి సమస్య ఏ ఒక్క పార్టీదీ కాదని, ఇది అందరిదీ అని రాజేంద్రప్రసాద్ వివరించారు.
Chandrababu
Tenali
Alapati Rajendraprasad

More Telugu News