Buddha Venkanna: సీఎం జగన్ అహం దెబ్బతినడంతోనే.. మండలి రద్దుకు నిర్ణయం: ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

  • మండలి రద్దును వ్యతిరేకిస్తూ.. టీడీపీ బైక్ ర్యాలీ
  • పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంపై వెంకన్న ఆగ్రహం
  • వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై బెదిరింపు చర్యలకు దిగుతోంది

ఏపీలో శాసనమండలి రద్దు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ.. విజయవాడలో టీడీపీ చేపట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండటంతో ర్యాలీకి అనుమతినివ్వడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ..మూడు రాజధానుల బిల్లును మండలిలో అడ్డుకోవడంతో సీఎం జగన్ అహం దెబ్బతిని మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నారన్నారు.  పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను బెదిరిస్తోందని ఆరోపించారు. మండలిని రద్దు చేసే ముందు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు పొందిన ఇద్దరితోనూ రాజీనామా చేయించాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News